Sunday, September 16, 2007

నివేదన

దాస్య శృంఖలాలలో బందీని కాలేను

విశృంఖలత్వానికి బానిసని కాలేను

భావాలకు భాష్యాలు, ఆదర్శాలకు అర్థాలు వినటమే తప్ప
అనుభవం లేని పసికూనను సమాజాన

ఇప్పటికీ మనిషినే నేనిప్పటికీ మనిషినే

మనీషిగా మారలేదు..... సంఘర్షణ మది వీడలేదు

అనంత లోకాలలో విశ్రాంతి తీసుకుంటున్న మనీషిగా పిలవబడే ఓ మనిషీ!
నా హృదయానికో మార్గాన్ని చూపు

నాకీ సమాజ బంధనాల నుండి విముక్తిని , ముక్తిని ప్రసాదించు

Thursday, August 9, 2007

That's about me

అనంతం నా నేపథ్యం
అశేషం నా ఊహా లోకం
అనితర సాధ్యం నా హృదయం
అద్వైతం నా వేదం